ఇది రాజన్న పాలన కాదు ...రౌడీ పాలన: కాంగ్రెస్ నేత

ABN , First Publish Date - 2020-05-17T15:27:04+05:30 IST

ఇది రాజన్న పాలన కాదు ...రౌడీ పాలన: కాంగ్రెస్ నేత

ఇది రాజన్న పాలన కాదు ...రౌడీ పాలన: కాంగ్రెస్ నేత

అమరావతి: విశాఖ‌లో నడి‌రోడ్డు మీద దళిత డాక్టరు సుధాకర్  చేతులు కట్టేసి , కొట్టి , ఈడ్చుకు వెళ్ళటం అమానుషమని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. ప్రశ్నించినందుకు పిచ్చి అని తేల్చేవేయడం దారుణమన్నారు. ‘‘రైతుల్ని కొడతారు..మహిళలని కొడతారు.. వలస కూలీలని కొడతారు.. ఉపాధ్యాయుల్ని వైన్ షాపుల ముందు నుంచోపెడతారు..ప్రశ్నిస్తే దాడి చేస్తారు’’ అని ఆమె పేర్కొన్నారు. ఇది రాజన్న పాలన కాదు ...రౌడీ పాలనఅని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-05-17T15:27:04+05:30 IST