కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కన్నుమూత

ABN , First Publish Date - 2020-03-02T13:48:51+05:30 IST

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కన్నుమూత

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కన్నుమూత

గుంటూరు: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కూచిపూడి సాంబశివరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం ఉదయం గుంటూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. నాగార్జున యూనివర్సిటీ ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడిగా, రాష్ట్ర గ్రంధాలయ సంస్థ చైర్మన్‌గా కూచిపూడి పనిచేశారు. 1985, 1999లో తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. కూచిపూడి భార్య విజయ గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. కూచిపూడి సాంబశివరావు స్వస్థలం అమృతలూరు మండలం ప్యాపర్రు. కూచిపూడి మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-03-02T13:48:51+05:30 IST