ప్రణబ్‌ చిత్రపటానికి నివాళులర్పించిన ఏపీ కాంగ్రెస్ నేతలు

ABN , First Publish Date - 2020-09-01T17:59:25+05:30 IST

నగరంలోని పీసీసీ కార్యాలయంలో దివంగత నేత ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ప్రణబ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్, ఉపాధ్యక్షుడు గంగాధర్

ప్రణబ్‌ చిత్రపటానికి నివాళులర్పించిన ఏపీ కాంగ్రెస్ నేతలు

విజయవాడ: నగరంలోని పీసీసీ కార్యాలయంలో దివంగత నేత ప్రణబ్ ముఖర్జీకి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు నివాళులర్పించారు. ప్రణబ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఏపీసీసీ చీఫ్ సాకే శైలజానాథ్, ఉపాధ్యక్షుడు గంగాధర్, నరసింహారావు, కొలనుకొండ శివాజీ, తదితర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన శైలజానాథ్.. కాంగ్రెస్ పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. ఈ దేశం కోసం ఎంతో సేవ చేసిన ప్రణబ్ ముఖర్జీ మృతి ఎంతో బాధాకరం అన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితి ఎదురైనా సమర్థవంతంగా పరిష్కారం చూపేవారన్నారు. పార్టీలో అనేక సంక్షోభాలకు తన మేధా శక్తితో ధీటుగా సమాధానం చెప్పారని కీర్తించారు. ఆయన మాటల్లో ప్రేమ, వాత్సల్యం కనిపించేవని శైలజానాథ్ పేర్కొన్నారు. ప్రణబ్ నేటి రాజకీయ నాయకులకు ఆదర్శ ప్రాయులు అని కొనియాడారు. దేశం, కాంగ్రెస్ పార్టీ ఒక శిఖరాన్ని కోల్పోయిందని, ఆయన కుటుంబ సభ్యులకు శైలజానాథ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Updated Date - 2020-09-01T17:59:25+05:30 IST