కాంగ్రెస్ చెప్పిందే ఏపీలో చూస్తున్నాం: తులసిరెడ్డి

ABN , First Publish Date - 2020-06-06T14:17:58+05:30 IST

కాంగ్రెస్ చెప్పిందే ఏపీలో చూస్తున్నాం: తులసిరెడ్డి

కాంగ్రెస్ చెప్పిందే ఏపీలో చూస్తున్నాం: తులసిరెడ్డి

అమరావతి: వైసీపీ అధికారంలోకి వస్తే అరాచకం రాజ్యమేలుతుందని ముందే చెప్పామని... కాంగ్రెస్‌ చెప్పిందే ఏడాది కాలంగా చూస్తున్నాం ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. ఏబీఎన్ డిబేట్‌లో మాట్లాడుతూ ప్రతిరోజు రాష్ట్రంలోని ఏదో మూలన దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. వైసీపీకి ఓటేయలేదని చాలా చోట్ల దాడులు జరిగాయని తెలిపారు.రాష్ట్రవ్యాప్తంగా గ్యాంగ్‌వార్‌లు పెరిగిపోయాయని... రాష్ట్రంలో పాలన యధారాజా తథా ప్రజలులా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో గంజాయి, నాటుసారా విచ్చలవిడిగా సరఫరా అవుతోందని తెలిపారు.


రాష్ట్రంలో నాటుసారాను కంట్రోల్‌ చేయలేకపోతున్నారని...మద్యం ధరలు పెంచి పేదల నడ్డివిరిచారని మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులు ఉండకూడదనేది ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. రాష్ట్రంలో గవర్నమెంట్‌ స్పాన్సర్డ్‌ అరాచకం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి ప్రజలకు మంచిపాలన అందించాలని తులసిరెడ్డి హితవు పలికారు. 

Updated Date - 2020-06-06T14:17:58+05:30 IST