మా పోరాటం కొనసాగిస్తాం: శైలజానాథ్

ABN , First Publish Date - 2020-07-27T17:24:02+05:30 IST

మా పోరాటం కొనసాగిస్తాం: శైలజానాథ్

మా పోరాటం కొనసాగిస్తాం: శైలజానాథ్

అమరావతి: మోదీ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా.. కాంగ్రెస్ ప్రభుత్వాలను కూలగొడుతుందని ఏపీసీసీ అధ్యక్షులు సాకే శైలజానాథ్ విమర్శించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ కరోనా నివారణ చర్యలు చేపట్టకుండా ... కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యం కాపాడుకోవడం కోసం కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. ప్రజల మేలు, దేశం మేలు కోరే వారు బీజేపీ అరాచకాలను ప్రశ్నించాలని అన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగానికి మోదీ ప్రభుత్వం తూట్లు పొడుస్తున్నారని వ్యాఖ్యానించారు. 


రాజస్థాన్ అసెంబ్లీని వెంటనే సమావేశ పరచాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు గవర్నర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టాలని నిర్ణయించామని అనుమతి లేదని పోలీసులుతో ఆపించారని మండిపడ్డారు. తమ పోరాటం కొనసాగిస్తామని శైలజానాథ్ స్పష్టం చేశారు. పోలీసుల నిరాకరణతో కాంగ్రెస్ కార్యాలయం గేటు వద్దే  నేతలు బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు.

Updated Date - 2020-07-27T17:24:02+05:30 IST