రెండు శ్రామిక రైళ్లకు అనుమతివ్వండి: కాంగ్రెస్‌

ABN , First Publish Date - 2020-05-10T10:14:22+05:30 IST

రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో ఉన్న వలస కూలీలను తరలించడానికి కాంగ్రెస్‌ ముందుకొచ్చింది.

రెండు శ్రామిక రైళ్లకు అనుమతివ్వండి: కాంగ్రెస్‌

విజయవాడ, మే 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో ఉన్న వలస కూలీలను తరలించడానికి కాంగ్రెస్‌ ముందుకొచ్చింది. అనంతపురం నుంచి పశ్చిమ బెంగాల్‌కు, నెల్లూరు నుంచి నిజాముద్దీన్‌కు రెండు శ్రామిక రైళ్లలో వలస కూలీలను తరలించడానికి అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌, ఏఐసీసీ కార్యదర్శి గిడుగు రుద్రరాజు, పీసీసీ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ గంగాధర్‌.. రాష్ట్ర నోడల్‌ అధికారి ఎంటీ కృష్ణబాబును కోరారు. 

Updated Date - 2020-05-10T10:14:22+05:30 IST