పిచ్చోడి చేతిలో ఏకే 47లా పాలన: శైలజానాథ్‌

ABN , First Publish Date - 2020-02-08T09:54:26+05:30 IST

‘‘వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర పాలన పిచ్చోడి చేతిలో ఏకే 47లా మారింది.

పిచ్చోడి చేతిలో ఏకే 47లా పాలన: శైలజానాథ్‌

తిరుపతి(జీవకోన) ఫిబ్రవరి 7: ‘‘వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర పాలన పిచ్చోడి చేతిలో ఏకే 47లా మారింది. సీఎం జగన్‌ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుని ప్రజలను కష్టపెడతాడో తెలియని పరిస్థితి ఏర్పడింది. తండ్రిపేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిన జగన్‌ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చాడు’’ అని పీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్‌ మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్న ఆయన శుక్రవారం తిరుపతికి వచ్చారు. డీసీసీ అధ్యక్షుడు వేణుగోపాల రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వికేంద్రీకరణ పేరుతో రూ.10 వేల కోట్ల ప్రజాధనంతో అమరావతిలో నిర్మించిన రాజధానిని మార్చాలనుకోవడం తుగ్లక్‌ పాలనకు నిదర్శనమన్నారు.

Updated Date - 2020-02-08T09:54:26+05:30 IST