వలంటీర్లకు చప్పట్లతో అభినందన
ABN , First Publish Date - 2020-10-03T07:09:31+05:30 IST
గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థతో మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు.
గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థతో మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారమవుతోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఈ వ్యవస్థ ఏర్పడి శుక్రవారం నాటికి ఏడాది పూర్తయిన సందర్భంగా వలంటీర్లను చప్పట్లతో అభినందించారు. గ్రామ, వార్డు సచివాలయాల అధికారులు, వలంటీర్లు ప్రజలకు సేవలందించడంలో ముందున్నారని సీఎం ప్రశంసించారు.
ఈ సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు సీఎం జగన్ సహా మంత్రులు, ఉన్నతాధికారులు చప్పట్లు చరిచి సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో మునిసిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తదితరులు పాల్గొన్నారు.