ప్రాంతానికో న్యాయం ఉంటుందా?
ABN , First Publish Date - 2020-05-09T09:59:42+05:30 IST
ప్రాంతానికో న్యాయం ఉంటుందా... ప్రభుత్వం చేసిన కుట్రలకు అన్ని విధాల నష్టపోయి, అమరావతి కోసం పోరాడుతుంటే మాపైన హత్యాయత్నం కేసులు, అన్యాయంగా ప్రజల ప్రాణాలు బలి తీసుకున్న ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ మీద పిక్ పాకెటింగ్ కేసులు పెడతారా అంటూ రైతులు నిలదీశారు.
143వ రోజు కొనసాగిన
అమరావతి రైతుల ఆందోళనలు
గుంటూరు, మే 8(ఆంధ్రజ్యోతి): ప్రాంతానికో న్యాయం ఉంటుందా... ప్రభుత్వం చేసిన కుట్రలకు అన్ని విధాల నష్టపోయి, అమరావతి కోసం పోరాడుతుంటే మాపైన హత్యాయత్నం కేసులు, అన్యాయంగా ప్రజల ప్రాణాలు బలి తీసుకున్న ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ మీద పిక్ పాకెటింగ్ కేసులు పెడతారా అంటూ రైతులు నిలదీశారు. రాష్ట్ర పాలనంతా అమరావతి నుంచే కొనసాగాలని ఆ ప్రాంత రైతులు చేస్తున్న ఆందోళనలు శుక్రవారానికి 143వ రోజుకు చేరాయి. లాక్‌డౌన్ నిబంధనలకు అనుగుణంగా రైతులు, మహిళలు, కూలీలు ఎవరి ఇంట్లో వారే కూర్చొని వివిధ రూపాల్లో నిరసనలు తెలిపారు.
అందులో భాగంగా విశాఖలో గురువారం జరిగిన గ్యాస్ లీకేజీ ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తులు వెలిగించి మౌనం పాటించారు. అలానే అస్వస్థతకు గురైన వారు త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు. 29 గ్రామాల రైతులు రాజధాని విషయంలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం బడేపురం, పొన్నెకలు, మోతడక తదితర గ్రామాల్లో నిరసన ప్రదర్శనలు చేశారు.