రాష్ట్రంలోని సమగ్ర ‘రీసర్వే’
ABN , First Publish Date - 2020-11-26T09:17:51+05:30 IST
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూములు, జనావాసాల రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టేందుకు పురపాలక శాఖ చురుగ్గా సమాయత్తమవుతోంది. వివాదాలు, న్యాయపరమైన సమస్యలకు ఆస్కారమివ్వని విధంగా

భూములు, జనావాసాల ‘పక్కా రికార్డు’
ఉన్నతాధికారులతో రాష్ట్రస్థాయి కమిటీ
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ఉన్న భూములు, జనావాసాల రీసర్వే కార్యక్రమాన్ని చేపట్టేందుకు పురపాలక శాఖ చురుగ్గా సమాయత్తమవుతోంది. వివాదాలు, న్యాయపరమైన సమస్యలకు ఆస్కారమివ్వని విధంగా రికార్డులను పకడ్బందీగా రూపొందించడమే లక్ష్యం గా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతోంది. దాదాపు వందే ళ్ల క్రితం, బ్రిటీష్ కాలంలో రాష్ట్రంలో జరిగిన సర్వే ఆధారంగానే స్థిరాస్తుల లావాదేవీలు కొనసాగుతున్నా యి. అయితే, ఈ మధ్యకాలంలో అన్ని ప్రాంతాల్లోనూ పట్టణీకరణ జరగడంతో భూముల ధరలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఇప్పటికే లక్షలాది ఎకరాల భూ ములు.. ఇళ్లు, నివాసేతర స్థలాలుగా మారాయి. ఈ నేపథ్యంలో ఆయా స్థలాలు, భూముల వ్యవహారాల్లో అక్రమాలు, వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పరిస్థితులను సరిదిద్దేందుకు పట్టణ భూములు, జనావాసాల రీసర్వే చేపట్టాలని పురపాలక శాఖ నిర్ణయించింది. ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు-భూరక్షణ పథకం’లో భాగంగా దీనిని చేపట్టనుంది.
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శాఖ సమన్వయంతో నిర్వహించనున్న ఈ రీసర్వేలో వార్డు ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీలతోపాటు పట్టణ సచివాలయాల్లోని ఇతర సెక్రటరీలు కూడా కీలకపాత్ర పోషిస్తారు. ప్రతి ఆస్తికీ ఒక యూనిక్ కోడ్ నెంబర్‌ను కేటాయిస్తారు. ఆ వివరాలన్నింటినీ నమో దు చేస్తూ రెవెన్యూ రికార్డులను సవరిస్తారు. అర్బన్ ల్యాండ్ అండ్ హ్యాబిటేషన్ రీ-సర్వే కార్యక్రమంగా పేర్కొంటున్న దీనిని సమర్ధంగా అమలు చేసేందు కు ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. సీడీఎంఏ చైర్మన్‌గా, డీటీసీపీ మెంబర్ కన్వీనర్‌గా(నోడల్ ఆఫీసర్) వ్యవహరించే దీనిలో సెటిల్‌మెం ట్లు, రికార్డులు, సీసీఎల్‌ఏలకు చెందిన సీనియర్ ఉన్నతాధికారులు ఇద్దరు సభ్యులుగా ఉంటారు.