రథం సింహాల మాయంపై పోలీసులకు ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-09-17T20:29:22+05:30 IST

ఇంద్రకీలాద్రి రథం సింహాల మాయంపై ఆలయ ఈవో సురేష్ బాబు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రథం సింహాల మాయంపై పోలీసులకు ఫిర్యాదు

విజయవాడ: ఇంద్రకీలాద్రి రథం సింహాల మాయంపై ఆలయ ఈవో సురేష్ బాబు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉగాది తర్వాత రథం తీయలేదని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 17 నెలల తర్వాత ఇంజనీరింగ్ పనుల కోసం పరిశీలిస్తే సింహాలు మాయమైనట్లు గుర్తించామన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టనున్నారు.


దుర్గగుడిలో మూడు సింహాల మాయంలో మర్మం అంతుచిక్కడం లేదు? పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఎందుకు వెనుకాడుతున్నారు? తప్పు ఒప్పుకుని సరిదిద్దుకుంటారా?...లేక నింద ప్రైవేట్ సెక్యురిటీపై నెట్టే ప్రయత్నం చేస్తారా?..వంటి జవాబు లేని ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి. వాస్తవాలు తెలియాలని అటు పత్రికలు, మీడియాలోనూ విస్తృతంగా ప్రచారం కావడంతో ఈవో సురేష్ బాబు ఇవాళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-09-17T20:29:22+05:30 IST