గ్యాస్ లీకేజీలపై కమిటీ
ABN , First Publish Date - 2020-07-08T08:45:58+05:30 IST
పరవాడ ఫార్మా సిటీలో సాయినార్ సంస్థతో పాటు నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లో గ్యాస్ లీకేజీ ఘటనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఓ కమిటీని ఏర్పాటు

- పరవాడ, నంద్యాల ఘటనలపై ఎన్జీటీ విచారణ
- అస్వస్థతకు గురైన ఒక్కొక్కరికి రూ.5 లక్షలు
- బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశం
న్యూఢిల్లీ, జూలై 7(ఆంధ్రజ్యోతి): పరవాడ ఫార్మా సిటీలో సాయినార్ సంస్థతో పాటు నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ లో గ్యాస్ లీకేజీ ఘటనలపై జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్ల ప్రతినిధులు, జిల్లా కలెక్టర్, ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ సీహెచ్వీ రామచంద్ర మూర్తి, ఆ వర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి ప్రొఫెసర్ పులిపాటి కింగ్ సభ్యులుగా ఉంటారని స్ప ష్టం చేసింది. బాధితులకు తుది నష్టపరిహారం, పర్యావరణం పునరుద్ధరణతో పాటు భవిష్యత్తులో తీసుకోవల్సిన జాగ్రత్తలపై అధ్యయనం చేసి మూడు నెలల్లో నివేదిక అందించాలని ఆదేశించింది.
సాయినార్, ఎస్పీ వై ఆగ్రో సంస్థల్లో గ్యాస్ లీకేజీ ఘటనలపై మీడియా కథనాల ఆధారంగా ఎన్జీటీ సుమోటోగా కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ కేసులపై ఎన్జీటీ చైర్మన్ జస్టిస్ ఏకే గోయల్, న్యాయ సభ్యుడు జస్టిస్ ఎస్పీ వాంగ్డి, సభ్య నిపుణులు సత్యవన్ సింగ్ గార్బ్యాల్, నాగిన్ నందాతో కూడిన నలుగురు సభ్యు ల ఽధర్మాసనం విచారణ జరిపి మంగళవారం ఉత్తర్వు లు జారీ చేసింది. పరవాడలో మరణించిన ఇద్దరి కు టుంబ సభ్యులకు ఇప్పటికే రూ.35 లక్షల చొప్పున సా యినార్ సంస్థ నష్టపరిహారం ప్రకటించిన నేపథ్యంలో అస్వస్థతకు గురైనవారికి కూడా నష్టపరిహారం చెల్లించాలని సూచించింది. మధ్యంతర పరిహారంగా అస్వస్థతకు గురైన నలుగురికి రూ.5 లక్షల చొప్పున రూ.20 లక్షలు జిల్లా కలెక్టర్ వద్ద రెండు వారాల్లోగా డిపాజిట్ చేయాలని ఆ సంస్థను ఆదేశించింది. అస్వస్థతకు గురైన వారికి ఈ మొత్తాన్ని అందించాలని కలెక్టర్కు ఎన్జీటీ సూచించింది. సాయినార్ సంస్థలో లీకైన బెంజిమిడజోల్, ఒమర్ప్రజోల్ సల్ఫైడ్ ప్రమాదకరమైన గ్యా స్లని ఎన్జీటీ తేల్చింది. ఇటువంటి గ్యాస్లు ఉన్నప్పుడు ఆన్ సైట్, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీ ప్రణాళికలు రూపొందించడంతో పాటు ప్రతి 6 నెలలకు ఒకసారి మాక్ డ్రిల్ నిర్వహించి సంబంధిత సంస్థకు నివేదిక సమర్పించాల్సి ఉంటుందని వివరించింది. కాగా..నంద్యాలలోని ఎస్పీవై ఆగ్రోలో మరణించిన ఒకరికి మధ్యంతర పరిహారంగా రూ.15 లక్షలు చెల్లించాలని ఎన్జీటీ ఆదేశించింది.