-
-
Home » Andhra Pradesh » committee eluru incident jagan Nadendla Manohar
-
ఏలూరు ఘటనపై కమిటీ వేసి సీఎం చేతులు దులుపుకొన్నారు: నాదెండ్ల
ABN , First Publish Date - 2020-12-20T01:12:03+05:30 IST
ఏలూరు ఘటనపై కమిటీ వేసి సీఎం జగన్ చేతులు దులుపుకొన్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు. సీఎంలో నాయకత్వ నైపుణ్యం, పాలన దక్షత లోపించాయని విమర్శించారు.

అమరావతి: ఏలూరు ఘటనపై కమిటీ వేసి సీఎం జగన్ చేతులు దులుపుకొన్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ తప్పుబట్టారు. సీఎంలో నాయకత్వ నైపుణ్యం, పాలన దక్షత లోపించాయని విమర్శించారు. ఎల్జీ పాలిమర్స్ బాధితుల మాదిరే ఏలూరు బాధితులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నిజాలు దాచడానికి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నిస్తోంది? అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు.
ఏలూరు వింత వ్యాధి ఘటనపై ప్రభుత్వం హైపవర్ కమిటీని ఏర్పాటు చేసింది. వింత వ్యాధిపై కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం 21 మంది సభ్యులతో హైపవర్ కమిటీ వేసింది. కమిటీ చైర్మన్‌గా ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీని నియమించారు. అలాగే కన్వీనర్‌గా ఆరోగ్య శాఖ ప్రినిపల్స్ సెక్రెటరీని నియమిస్తూ...నివారణ చర్యలు కూడా సూచించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
మరోవైపు ఇప్పటి వరకు ఈ వ్యాధి బారిన పడ్డ 609 మందిలో 543 మంది ఆసుపత్రుల్లో కోలుకొని డిశ్చార్జి అయ్యారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న వారిలో 33 మందిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలించారు. ఈ వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందారు.