-
-
Home » Andhra Pradesh » Commissioner Katamneni Bhaskar
-
ఏపీలో కొత్త వైరస్ నిర్ధారణ కాలేదు: కాటంనేని భాస్కర్
ABN , First Publish Date - 2020-12-29T02:07:39+05:30 IST
రాష్ట్రంలో కరోనా కొత్త వైరస్ ఇంకా నిర్ధారణ కాలేదని ఏపీ వైద్యారోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. ప్రజలు ఎటువంటి అపోహలు

అమరావతి: రాష్ట్రంలో కరోనా కొత్త వైరస్ ఇంకా నిర్ధారణ కాలేదని ఏపీ వైద్యారోగ్య శాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తెలిపారు. ప్రజలు ఎటువంటి అపోహలు, ఆందోళనలకు గురికావొద్దని సూచించారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సోమవారం సాయంత్రం వరకు బ్రిటన్ నుంచి 1363 మంది ఏపీకొచ్చారు. 1346 మంది ఆచూకీని కనుగొన్నాం. మరో 17 మంది వ్యక్తుల చిరునామా తెలియాల్సి ఉంది. ఇందులో 11 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరి రక్త నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్, హైదరాబాద్‌లోని సీసీఎంబీకి పంపాం. పరీక్షా ఫలితాలు వచ్చిన తర్వాతే కొత్త వైరస్సా..? లేదా అనేది నిర్ధారణవుతుంది. ఇప్పటివరకు 1324 మంది క్వారంటైన్‌లో ఉన్నారు. పరిచయస్తులైన 5,784 మందిని గుర్తించి.. వారి రక్త నమూనాలను పరీక్షలకు పంపాం. బ్రిటన్ నుంచి వచ్చే ప్రతివారూ వైద్య టెస్ట్ చేయించుకోవాల్సిందే’ అని కాటంనేని భాస్కర్ స్పష్టం చేశారు.