-
-
Home » Andhra Pradesh » Come to our wedding donate blood
-
మా పెళ్లికి రండి.. రక్తదానం చేయండి!
ABN , First Publish Date - 2020-12-28T09:33:25+05:30 IST
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన నీలం దయాసాగర్ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన నీలం దయాసాగర్ చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్నాడు. అతడి వివాహం పట్టణానికే చెందిన పద్మసాయి కృష్ణవేణితో ఆదివారం రాత్రి 10.35 గంటలకు జరిగింది. ఈ పెళ్లి వేడుకలో విందు భోజనాలతోపాటు రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశాడు దయాసాగర్. పెళ్లికి వచ్చే బంధుమిత్రులు రక్తదానం చేయాలని వివాహ ఆహ్వానపత్రికలోనూ కోరాడు. అతడి కోరికను మన్నించి 35 మంది బంధుమిత్రులు రక్తదానం చేశారు. వివాహం సందర్భంగా ఆదర్శంగా నిలిచిన దయాసాగర్ దంపతులను అతిథులు అభినందించారు.
- పిఠాపురం