-
-
Home » Andhra Pradesh » Colonel Santoshbabu family cm kcr
-
సంతోష్‌బాబు కుటుంబానికి అండగా ఉంటా
ABN , First Publish Date - 2020-06-23T09:12:25+05:30 IST
కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు హమీ ఇచ్చా రు. సోమవారం సూర్యాపేట

- 5కోట్ల ఇంటి స్థలం, ఉద్యోగ నియామక పత్రాలిచ్చిన: కేసీఆర్
సూర్యాపేట, జూన్ 22(ఆంధ్రజ్యోతి): కల్నల్ సంతోష్‌బాబు కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ సీఎం కె.చంద్రశేఖరరావు హమీ ఇచ్చా రు. సోమవారం సూర్యాపేట విద్యానగర్‌లోని సంతోష్‌బాబు నివాసానికి వ చ్చిన కేసీఆర్.. కల్నల్‌కు నివాళులర్పించారు. అనంతరం, సంతోష్‌బాబు భా ర్య సంతోషి, తల్లిదండ్రులు బిక్కుమళ్ల ఉపేందర్, మంజుల, సోదరి శ్రుతిల ను ఓదార్చారు. ప్రభుత్వం తరఫున సంతోష్‌బాబు భార్యకు రూ.4 కోట్లు, సంతోష్‌బాబు తల్లిదండ్రులకు రూ.కోటి చెక్కులను అందజేశారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో 711 చదరపు గజాల స్థలానికి సంబంధించిన పత్రాన్ని, గ్రూప్-1 ఉద్యోగ నియామక పత్రాన్ని సంతోషికి అందజేశారు.