-
-
Home » Andhra Pradesh » Collector Sheshagiribabu speaks with media
-
600 ఐసోలేషన్ బెడ్స్ ఏర్పాటు చేస్తున్నాం: కలెక్టర్ శేషగిరిబాబు
ABN , First Publish Date - 2020-03-23T18:56:40+05:30 IST
నెల్లూరు: నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి రైతు బజార్లను వినియోగిస్తున్నామని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు.

నెల్లూరు: నిత్యావసర సరుకులు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి రైతు బజార్లను వినియోగిస్తున్నామని నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పొలీసులు చర్యలు తీసుకొంటున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో 600 ఐసోలేషన్ బెడ్స్ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు.
10 మంది కంటే ఎక్కువ ఎవరు గుమికూడకూడదని శేషగిరిబాబు పేర్కొన్నారు. 885 మంది విదేశాల నుంచి వచ్చారని.. 546 మందికి హోమ్ ఐసోలేషన్‌లో చికిత్స ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ నెల 31 వరకు ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టన్స్ పాటించాలన్నారు. ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్న పాజిటివ్ వ్యక్తికి రెండు సార్లు నెగటివ్ వస్తే డిశ్చార్జ్ చేస్తామని శేషగిరిబాబు స్పష్టం చేశారు.