-
-
Home » Andhra Pradesh » Collector letter to the Bank Officers Association
-
బ్యాంకు అధికారుల సంఘానికి కలెక్టర్ ఇంతియాజ్ లేఖ
ABN , First Publish Date - 2020-12-28T00:18:05+05:30 IST
బ్యాంకు అధికారుల సంఘానికి కలెక్టర్ ఇంతియాజ్ లేఖ రాశారు. బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనపై కలెక్టర్ విచారం వ్యక్తం చేశారు.

విజయవాడ: బ్యాంకు అధికారుల సంఘానికి కలెక్టర్ ఇంతియాజ్ లేఖ రాశారు. బ్యాంకుల ముందు చెత్త వేసిన ఘటనపై కలెక్టర్ విచారం వ్యక్తం చేశారు. ఘటన తెలిసిన వెంటనే నిమిషాల్లోనే చెత్తను తీసివేయించామని తెలిపారు. చెత్త వేసిన ఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామని, బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బ్యాంకులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని, ప్రభుత్వ కార్యక్రమాల అమలుకు కలిసి పనిచేద్దామని లేఖలో కలెక్టర్ కోరారు.
కృష్ణాజిల్లా ఉయ్యూరుతో పాటు విజయవాడ నగరంలో 16 బ్యాంకు శాఖల ముందు చెత్త వేయడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు రుణాలివ్వడానికి కొన్ని బ్యాంకులు ముందుకు రావడంలేదు. దీనికి నిరసనగా అధికారులు ఈ చర్యలకు పాల్పడ్డారు. ఉయ్యూరు కమిషనర్ ఒక అడుగు ముందుకేసి పీఎం స్వానిధి, జగనన్న తోడు, వైఎస్సార్ చేయూత పథకాలను రుణాలు ఇవ్వనందుకు నిరసనగా ఈ విధంగా చెత్తను వేసినట్టుగా బ్యాంకు గేట్లకు ప్రత్యేకంగా తన పేరుతో బోర్డులు పెట్టించారు.