త్వరలో విశాఖలో ఐటీ హైఎండ్‌ స్కిల్డ్‌ యూనివర్సిటీ ఏర్పాటు: జగన్

ABN , First Publish Date - 2020-11-04T01:29:45+05:30 IST

త్వరలో విశాఖలో ఐటీ హైఎండ్‌ స్కిల్డ్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఐటీ పాలసీపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రొబొటిక్స్‌ వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. స్వదేశీ

త్వరలో విశాఖలో ఐటీ హైఎండ్‌ స్కిల్డ్‌ యూనివర్సిటీ ఏర్పాటు: జగన్

అమరావతి: త్వరలో విశాఖలో ఐటీ హైఎండ్‌ స్కిల్డ్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ఐటీ పాలసీపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, రొబొటిక్స్‌ వంటి అంశాలపై శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం చెప్పారు. స్వదేశీ, విదేశీ ఐటీ దిగ్గజ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంటామన్నారు. ఏటా కనీసం 2 వేల మందికి విశాఖ సంస్థలో శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఐటీలో డిమాండ్‌కు అనుగుణంగా డిగ్రీ, డిప్లొమా కోర్సులు కూడా ప్రారంభించాలని అధికారులకు జగన్ ఆదేశించారు.

Updated Date - 2020-11-04T01:29:45+05:30 IST