డాక్టర్‌ రెడ్డీస్‌ సాయం 5 కోట్లు

ABN , First Publish Date - 2020-04-08T10:23:45+05:30 IST

రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలకు పలువురు దాతలు ముందుకువస్తున్నారు.

డాక్టర్‌ రెడ్డీస్‌ సాయం 5 కోట్లు

50 వేల మంది కార్మికులకు నిత్యావసరాలు

ఆంధ్ర షుగర్స్‌ సాయం 2.85 కోట్లు

సుజనా చౌదరి విరాళం 2 కోట్లు


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలకు పలువురు దాతలు ముందుకువస్తున్నారు. సీఎం సహాయ నిధికి మంగళవారం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ రూ.5 కోట్లు అందించింది. సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ నారాయణరెడ్డి విజయవాడలోని సీఎస్‌ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని కలిసి చెక్కును అందజేశారు. 50 వేల మంది కార్మికులకు నిత్యావసరాలను ఇచ్చారు. మంగళవారం అమరావతిలో సామాగ్రి వాహనాన్ని హోం మంత్రి మేకతోటి సుచరిత జెండా ఊపి ప్రారంభించా రు.


వాహనంలో లక్ష కిలోల బియ్యం, 10 వేల లీటర్ల నూనె, 10 వేల కిలోల కందిపప్పు తదితర సామాగ్రి ఉన్నాయి. సీఎంఆర్‌ఎ్‌ఫకు ఆంధ్ర షుగర్స్‌ లిమిటెడ్‌, అనుబంధ సంస్థలు రూ.2.85 కోట్ల విరాళాన్ని సీఎం జగన్‌కు అందజేసినట్టు సంస్థ అధినేత పెండ్యాల న రేంద్రనాథ్‌ చౌదరి తెలిపారు. ఇవికాకుండా రూ.80 లక్షల విలువైన 800 టన్నుల సోడియం హైపో క్లోరైడ్‌, 7500 లీటర్ల హ్యాండ్‌ శానిటైజర్లను అందజేయను న్నట్టు తెలిపారు. తన ఎంపీ నిధుల నుంచి రూ.కోటి కేటాయిస్తున్నట్లు సుజనా చౌదరి సీఎం జగన్‌కు లేఖ రాశారు. సుజనా ఫౌండేషన్‌ తరఫున రాష్ట్రంలో వైద్యపరికరాలు, నిత్యావసరాలను పంపిణీ చేయనున్నట్లు  తెలిపారు.


ఈ మొత్తంలో ఏపీ బీజేపీ ద్వారా రూ.25 లక్షలు,  స్వచ్ఛంద సంస్థల ద్వారా రూ.75 లక్షలు ఖ ర్చు చేస్తామన్నారు. ఇండియన్‌ టుబాకో అసోసియేషన్‌(ఐటీఏ) రూ.60 లక్షలు విరాళం ప్రకటించింది. గుం టూరులోని పొగాకు బోర్డు కార్యాలయంలో చైర్మన్‌ ర ఘునాఽథబాబుకు ఐటీఏ అధ్యక్షుడు మద్ది వెంకటేశ్వరరావు రూ.30 లక్షలు చెక్కును పీఎం కేర్స్‌కు అందజేశా రు. ఏపీసీఎంఆర్‌ఎ్‌ఫకు రూ.15 లక్షలు అందజేశారు. 


పోలీసులకు ‘కిమ్స్‌’ రూ.50 లక్షలు 

పోలీసు సహాయ నిధికి ‘కిమ్స్‌’ హాస్పిటల్‌ రూ.50 లక్షలు అందజేసింది. ఆసుపత్రి అధినేత డాక్టర్‌ భాస్కరరావు, పోలీస్‌ బాస్‌ గౌతమ్‌ సవాంగ్‌కు విరాళం చెక్కును అందజేశారు. కాకినాడలోని జెమిని ఏడబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ జనరల్‌ మేనేజర్స్‌ గురుప్రసాద్‌, ఎ.రవిచంద్ర రూ.50 లక్షల చెక్కును మంత్రి కన్నబాబుకు అందజేశారు. పీఎం కేర్స్‌కు మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు రూ.6 లక్షలు ప్రకటించారు. కాకినాడ సీపోర్ట్స్‌ లిమిటెడ్‌ సీఈవో మురళీధర్‌ రూ.50 లక్షల విరాళాన్ని కలెక్టర్‌ డి.మురళీఽధర్‌రెడ్డికి అందజేశారు.  అలాగే, జీవీపీఆర్‌ ఇంజనీర్స్‌ లిమిటెడ్‌ తరఫున సంస్థ చైర్మన్‌ జీఎ్‌సపీ వీరారెడ్డి ఒక కోటీ 458 రూపాయల చెక్కును సీఎం జగన్‌కు తాడేపల్లిలో కలిసి అందజేశారు. అలాగే సాగర్‌ సిమెంట్స్‌ తరఫున ఎండీ ఆనంద్‌రెడ్డి, జేఎండీ శ్రీకాంత్‌రెడ్డి కూడా సీఎంను కలిసి తమ వంతుగా కోటి రూపాయల విరాళాన్ని సీఎంఆర్‌ఎ్‌ఫకు అందజేశారు. 


 రామ్‌కో విరాళం 2.5 కోట్లు

రామ్‌కో సిమెంట్స్‌ సీఎం సహాయ నిధికి రూ.2.50 కోట్లు అందించింది. దీంతో పాటు థర్మల్‌ స్కానర్లు, పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కులు అందించింది. కృష్ణా, కర్నూలు జిల్లాల్లోని జగ్గయ్యపేట, కొలిమిగుండ్ల మండలాల్లో క్రిమిసంహారక చర్యలు చేపట్టింది. ఒడిసాకు రూ.2 కోట్ల విలువైన అత్యవసర వైద్య పరికరాలను 36 గంటల్లో రోడ్డు మార్గంలో భువనేశ్వర్‌కు తరలించింది. సహకరించిన ట్రక్కు డ్రైవర్లను, ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లను రామ్‌కో సత్కరించింది. 


జీతంలో 30 శాతం కోతకు అంగీకారం: గవర్నర్‌

కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఏడాది పాటు తన జీతంలో 30 శాతం కోతను విధించుకోడానికి సంసిద్ధత తెలియచేస్తూ గవర్నర్‌ హరిచందన్‌ రాష్ట్రపతికి లేఖ రాశారు.  


Updated Date - 2020-04-08T10:23:45+05:30 IST