దళితుల సంక్షేమంపై చర్చకు సీఎం సిద్ధమా!: వర్ల

ABN , First Publish Date - 2020-06-06T10:10:33+05:30 IST

‘‘వైసీపీ పాలనలో దళితుల సంక్షేమానికి ఎంత ఖర్చు చేశారు? సీఎం జగన్‌ బహిరంగ చర్చకు సిద్ధమా? బిస్కెట్‌ బ్యాచ్‌, ఉత్సవ విగ్రహాలతో కాదు.. సీఎంతోనే చర్చ! సమయం, వేదిక చెప్పండి. సచివాయాలనికైనా రావటానికి మేం సిద్ధం’’ అని అని

దళితుల సంక్షేమంపై చర్చకు సీఎం సిద్ధమా!: వర్ల

‘‘వైసీపీ పాలనలో దళితుల సంక్షేమానికి ఎంత ఖర్చు చేశారు? సీఎం జగన్‌ బహిరంగ చర్చకు  సిద్ధమా? బిస్కెట్‌ బ్యాచ్‌, ఉత్సవ విగ్రహాలతో కాదు.. సీఎంతోనే చర్చ! సమయం, వేదిక చెప్పండి. సచివాయాలనికైనా రావటానికి మేం సిద్ధం’’ అని అని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సవాల్‌ విసిరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల చంద్రబాబు హయాంలో, ఏడాది వైసీపీ పాలనలో రాష్ట్రంలో దళితులకు జరిగిన సంక్షేమంపై చర్చించడానికి సీఎం జగన్‌ సిద్ధం కావాలన్నారు. నాటి మంత్రి నక్కా ఆనంద్‌బాబు, తాను బహిరంగ చర్చకు వస్తామని అన్నారు. మాజీ ఐఏఎస్‌, ఐపీఎస్‌, సీనియర్‌ జర్నలిస్ట్‌ మధ్యవర్తిత్వం నిర్వహించాలన్నారు. వైసీసీ తరుఫున సీఎం జగన్‌, సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి చర్చలో పాల్గొనాలని కోరారు. దళిత వర్గాలు జగన్‌ని ఈసడించుకుంటున్నాయన్నారు. జగన్‌, వైఎస్‌ ఇద్దరూ దళితులను మోసం చేశారని ఆరోపించారు. ఏడాది పాలనలో జగన్‌రెడ్డి తీసుకున్న అనేక రకాల టర్న్‌లతో.. డిక్షనరీలో యూ టర్న్‌తో పాటు కొత్తగా జే-టర్న్‌ అనే పదం వచ్చి చేరిందని టీడీపీ ఎమ్మెల్సీ దీపక్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

Updated Date - 2020-06-06T10:10:33+05:30 IST