గవర్నర్‌తో సీఎం భేటీ

ABN , First Publish Date - 2020-06-23T09:06:49+05:30 IST

శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించినందుకు గవర్నర్‌

గవర్నర్‌తో సీఎం భేటీ

  • గవర్నర్‌కు సీఎం ధన్యవాదాలు
  • రాజ్‌భవన్‌లో 30 నిమిషాలు భేటీ

శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించినందుకు గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను సీఎం కలిశారు. సహజంగా బడ్జెట్‌ సమావేశాలు ముగిశాక గవర్నర్‌ను కలసి సీఎం ధన్యవాదాలు చెప్పడం సంప్రదాయమని.. అదే ఒరవడిని సీఎం కొనసాగించారని వివరించాయి. అయితే, విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు శాసనమండలిలో ద్రవ్య వినిమయ బిల్లు,.సీఆర్‌డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు, ఆక్వా బిల్లులు ఆమోదం పొందక పోవడం కూడా 30 నిమిషాల ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం.


మండలిలో మంత్రులు తమపై దౌర్జన్యం చేశారంటూ గవర్నర్‌కు మాజీ సీఎం చంద్రబాబు ఫిర్యాదు చేసిన అంశంపై గవర్నర్‌కు సీఎం జగన్‌ వివరణ ఇచ్చారని తెలిసింది. ఇద్దరు మంత్రులు రాజ్యసభకు ఎన్నికైనందున, వారి స్థానంలో మంత్రివర్గంలోకి ఇద్దరిని తీసుకుంటున్నామని కూడా గవర్నర్‌కు సీఎం చెప్పినట్టు తెలిసింది. ఈ భేటీలో సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాల్గొన్నారు.

Read more