సీఎంకూ పరిమితులుంటాయి: ఐవైఆర్
ABN , First Publish Date - 2020-03-16T08:53:56+05:30 IST
‘151 సీట్లు వచ్చినా, 175 సీట్లు వచ్చినా రాజ్యాంగబద్ధంగా నడిచే ప్రభుత్వ విధానంలో ముఖ్యమంత్రి అధికారాలకు పరిమితులుంటాయి అనే మౌలిక సత్యాన్ని సీఎం జగన్ గ్రహిస్తే మంచిది’ అని మాజీ సీఎస్
అమరావతి, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ‘151 సీట్లు వచ్చినా, 175 సీట్లు వచ్చినా రాజ్యాంగబద్ధంగా నడిచే ప్రభుత్వ విధానంలో ముఖ్యమంత్రి అధికారాలకు పరిమితులుంటాయి అనే మౌలిక సత్యాన్ని సీఎం జగన్ గ్రహిస్తే మంచిది’ అని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు వ్యాఖ్యానించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థలపై విపరీత ఆరోపణలు చేసే ముందు కొంత ఆలోచించడం ఎందుకైనా మంచిదని ఆదివారం ఆయన ట్వీట్ చేశారు. ఎన్నికలను వాయిదా వేసిన తర్వాత అధికారులను బదిలీ చేసే అధికారం ఈసీకి ఉందా అనే ఒక్క విషయం మినహాయిస్తే, మిగిలిన అన్ని విషయాల్లోనూ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై, పూర్తయ్యే వరకూ ఈసీకి అధికారం ఉంటుందని వివరించారు.