కొమరగిరి.. అభివృద్ధి పనుల్లో సీఎం జగన్‌

ABN , First Publish Date - 2020-12-25T19:50:54+05:30 IST

జిల్లాలోని కొత్తపల్లి మండలం కొమరగిరిలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. వైఎస్‌ఆర్‌ జగనన్న ఇళ్ల పట్టాల పైలాన్‌ను శుక్రవారం ఆవిష్కరించారు.

కొమరగిరి.. అభివృద్ధి పనుల్లో సీఎం జగన్‌

తూ.గో: జిల్లాలోని కొత్తపల్లి మండలం కొమరగిరిలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. వైఎస్‌ఆర్‌ జగనన్న ఇళ్ల పట్టాల పైలాన్‌ను శుక్రవారం ఆవిష్కరించారు. అలాగే నవరత్నాలు- పేదలకు ఇళ్లు పథకాన్ని జగన్‌ ప్రారంభించనున్నారు. 15 రోజుల పాటు ఇళ్ల పట్టాల పంపిణీ ప్రక్రియ కొనసాగనుంది. లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణాల్లో సెంటు భూమిని ప్రభుత్వం కేటాయించింది. 68,361 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల రూపంలో ప్రభుత్వం ఇవ్వనుంది. ఈమేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. 

Updated Date - 2020-12-25T19:50:54+05:30 IST