ఎంపీ ఇంట్లో ఏం జరిగింది?.. సీఎం జగన్ రంగంలోకి దిగాలి: వర్ల రామయ్య

ABN , First Publish Date - 2020-04-27T01:06:42+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు.

ఎంపీ ఇంట్లో ఏం జరిగింది?.. సీఎం జగన్ రంగంలోకి దిగాలి: వర్ల రామయ్య

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. కర్నూలులో కరోనాపై సీఎం జగన్ ప్రకటన చేయాలని ట్విట్టర్ వేదికగా టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా చూడాలని వర్ల రామయ్య అన్నారు. కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్‌ ఇంట్లో ఏం జరిగింది?, ఏం జరుగుతున్నది అని సీఎంను వర్ల రామయ్య ప్రశ్నించారు. అక్కడ ఏమి జరుగబోతున్నది రాష్ట్ర ప్రజలకు తెలపాలని వల్ల రామయ్య డిమాండ్ చేశారు.



Updated Date - 2020-04-27T01:06:42+05:30 IST