పాలనచేతగాని తన అసమర్థతను జగన్ ఒప్పుకోవడం లేదు: దేవినేని

ABN , First Publish Date - 2020-08-11T23:09:26+05:30 IST

పాలనచేతగాని తన అసమర్థతను జగన్ ఒప్పుకోవడం లేదు: దేవినేని

పాలనచేతగాని తన అసమర్థతను జగన్ ఒప్పుకోవడం లేదు: దేవినేని

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. ఒక్కఛాన్స్ పుణ్యమా అని, ఈవీఎంల పుణ్యమా అని అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి, పాలనచేతగాని తన అసమర్థతను ఒప్పుకోవడం లేదని దేవినేని ఉమ మండిపడ్డారు. కేంద్రానికి చెబుతున్న కరోనా లెక్కలకు, రాష్ట్రంలో నమోదవుతున్న కేసులకు పొంతనే ఉండటం లేదని, ఆరోగ్యశ్రీ కింద ఎంతమంది కరోనా రోగులకు చికిత్స అందించారో చెప్పగలరా?  అని ప్రశ్నించారు. మాస్కులు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని, చంద్రబాబు పెట్టిన మెడ్ టెక్ జోన్ ని వాడుకోవడానికి ప్రభుత్వానికి నామోషీగా ఉందని దేవినేని అన్నారు. ఎక్విప్ మెంట్ లేదని వైద్య సిబ్బంది, డాక్టర్లు ఎందుకు రోడ్లెక్కుతున్నారు? అని ప్రశ్నించారు. క్వారంటైన్ 


కేంద్రాల్లో పెడుతున్న రూ.500 భోజనాన్ని మంత్రులు తినాలని, ప్రభుత్వ అసమర్థత, లెక్కలేనితనం, చేతగాని తనం వల్లే ప్రజల ఆరోగ్యం గాలిలో ఉందని విమర్శించారు. మంత్రులు, డిప్యూటీ సీఎంలు, ఎమ్మెల్యేలు, రాజ్యసభ సభ్యులు పక్కరాష్ట్రాల్లో చికిత్స తీసుకోవడానికి వెళితే, సామాన్యుడు మాత్రం ఇక్కడే ప్రాణాలు పోగొట్టుకుంటున్నాడని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.ముఖ్యమంత్రి ఇప్పటికైనా కరోనాపై వాస్తవాలు తెలుసుకోవాలంటే, ప్రభుత్వ ఆస్పత్రులను సందర్శించాలని, చంద్రబాబు బస్ లో ఉండి పాలన చేయబట్టే, రైతులు రాజధానికి భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారని, అమరావతి రైతుల గుండెలపై తన్నేలా సంతకం పెట్టిన గవర్నర్ ఉండే భవనం కూడా చంద్రబాబు నివసించిందే అని దేవినేని ఉమ అన్నారు.


Updated Date - 2020-08-11T23:09:26+05:30 IST