జగన్ బాధ్యత లేకుండా మాట్లాడారు: యనమల
ABN , First Publish Date - 2020-04-01T15:58:21+05:30 IST
సీఎం జగన్ బాధ్యత లేకుండా మాట్లాడారని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కరోనా జ్వరంలాంటిదే, భయంలేదని సీఎం ఎలా అంటారని ప్రశ్నించారు.

అమరావతి: సీఎం జగన్ బాధ్యత లేకుండా మాట్లాడారని మాజీమంత్రి యనమల రామకృష్ణుడు మండిపడ్డారు. కరోనా జ్వరంలాంటిదే, భయంలేదని సీఎం ఎలా అంటారని ప్రశ్నించారు. ప్రజల ఆరోగ్యం పట్ల సీఎంకు ఎంత బాధ్యత ఉందో అర్థమవుతోందన్నారు. కరోనాను అరికట్టేందుకు ప్రజలను చైతన్య పరిచేలా జగన్ మాట్లాడలేదని తప్పుబట్టారు. ఉద్యోగుల జీతాల్లో కోత విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను స్వాగతిస్తున్నామని చెప్పారు. ఆర్థిక కష్టాలను అర్థం చేసుకుని ఉద్యోగులు సహకరించాలని కోరారు. కరోనా అడ్డుపెట్టుకొని వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని, క్లిష్ట పరిస్థితుల్లోనూ యథేచ్చగా అక్రమాలు సాగిస్తున్నారని యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు.