-
-
Home » Andhra Pradesh » CM Jagan Visited to Eluru Tomorrow
-
ఏలూరుకు సీఎం జగన్.. అస్వస్థతకు గురైన వారికి పరామర్శ
ABN , First Publish Date - 2020-12-07T00:47:33+05:30 IST
ఏలూరులో 100 మంది అస్వస్థతకు గురికావడంపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు..

ప.గో.: ఏలూరులో 100 మంది అస్వస్థతకు గురికావడంపై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆదేశించారు. సమస్యకు గల కారణాలపై అధ్యయనం చేయాలని, అవసరమైతే ఉన్నతస్థాయి నిపుణుల సలహాలు తీసుకోవాలని వైద్యశాఖను గవర్నర్ కోరారు. ఇప్పటికే ఈ ఘటనపై స్పందించిన సీఎం జగన్... వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్ల నానికి ఫోన్ చేసి మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. వారందరికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. మరోవైపు సోమవారం ఏలూరుకు వెళ్లనున్న సీఎం జగన్.. అస్వస్థతకు గురైన వారిని పరామర్శించనున్నారు.