బుధవారం ఏలూరులో సీఎం జగన్‌ పర్యటన

ABN , First Publish Date - 2020-11-04T02:44:43+05:30 IST

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో (రేపు) బుధవారం సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు. ఉదయం 10.35 గంటలకు ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియానికి

బుధవారం ఏలూరులో సీఎం జగన్‌ పర్యటన

అమరావతి: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో (రేపు) బుధవారం సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు. ఉదయం 10.35 గంటలకు ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియానికి చేరుకోనున్నారు. ఉదయం 10.43 గంటలకు వీవీ నగర్‌ బెయిలీ బ్రిడ్జ్‌ సెంటర్‌ వద్ద పలు అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. అటు తర్వాత ఉదయం 10.57 గంటలకు శ్రీ సూర్య కన్వెన్షన్‌ హాల్‌లో షేక్‌ ముజుబుర్‌ రెహమాన్‌ కుమార్తె  వివాహానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. తిరిగి ఉదయం 11.57 గంటలకు తాడేపల్లి నివాసానికి సీఎం చేరుకోనున్నారు. 

Updated Date - 2020-11-04T02:44:43+05:30 IST