పంటల బీమాపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్
ABN , First Publish Date - 2020-12-15T20:48:08+05:30 IST
పంటల బీమాపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
తిరుపతి: పంటల బీమాపై సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో పంటల బీమా ఊసేలేదని తెలిపారు. వైసీపీ హయాంలో రైతులకు ఎక్కడ అన్యాయం జరిగిందో చంద్రబాబు చెప్పాలని ప్రశ్నించారు. రైతులను సీఎం జగన్ ఆదుకుంటున్నారని, రైతు సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. టీడీపీ హయాంలో రైతులకు అన్యాయం జరిగిందని, వారికి ఎలాంటి భరోసా కల్పించలేదని నారాయణస్వామి చెప్పారు.