-
-
Home » Andhra Pradesh » CM Jagan Varla ramaiah TDP
-
వాళ్లు కలిస్తే తప్పేంటి.. ‘రహస్య భేటీ’పై వర్ల రామయ్య
ABN , First Publish Date - 2020-06-23T23:41:44+05:30 IST
సీఎం జగన్, వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.

అమరావతి: సీఎం జగన్, వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస రావు రహస్య సమావేశంపై స్పందించిన ఆయన.. ఆ ముగ్గురు కలిస్తే తప్పేంటన్నారు. వైసీపీ నేత అంబటి రాంబాబు ముఖం ఆనందంతో వెలిగిపోతుందని, ఏదో పెద్దపెద్దగా మాట్లాడుతున్నారని, హావభావాలు చూపిస్తూ నటిస్తున్నారని విమర్శించారు. దొంగ దొరికాడని అంబటి అంటున్నారని.. ఎవరు దొంగ అని ప్రశ్నించారు. ఆయన అపాయింట్ మెంట్ తీసుకుని వెళ్లారు. ఏపీ ప్రభుత్వ తీరును కేంద్రం దృష్టికి తీసుకువెళ్లమని చెప్పడానికి వెళ్లినట్టున్నారున్నారు. ‘‘సుప్రీం ఆదేశాలను జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. నిమ్మగడ్డ ఎందుకు రాజీనామా చేయాలి? వారేమైనా అసాంఘీక శక్తులా? వారేమైనా నేరస్తులా.. ఎందుకు కలవకూడదు? జగన్ ప్రభుత్వ అస్తవ్యస్త ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తే తప్పేంటి? సుజనా, కామినేనితో నిమ్మగడ్డ భేటీ అయితే తప్పేంటి?’’ ఘాటుగా ప్రశ్నించారు.
చట్టాలు తెలుసుకొని మాట్లాడాలని, మిడిమిడి జ్ఞానంతో మాట్లాడొద్దని వైసీపీకి హితవు పలికారు. ఛానల్ ఉందని బాకా ఊదొద్దని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజ్ పోలీసులు తీసుకువెళ్లారని అంటున్నారని.. అసలు వాళ్లు తీసుకు వెళితే.. సాక్షికి అది ఎలా వెళ్లిందన్నారు? పోలీసు విభాగానికి సాక్షి ఏమైనా అనుబంధ సంస్థా... పరిపాలనలో సాక్షి భాగమా అని ఘాటుగా ప్రశ్నించారు. ప్రభుత్వ యంత్రాంగం ఇస్తే అన్ని ఛానళ్లకు ఇవ్వాలని.. కానీ సాక్షికి ఎలా ఇచ్చారన్నారు. సాక్షి పుట్టుక నుంచి అవినీతిమయమన్న ఆయన.. సాక్షిలో 834 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారన్న విషయాన్ని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడా లేదని.. దానిపై కోర్టులో విచారణ జరుగుతోందన్నారు. కాగల కార్యాన్ని గంధర్వులే తీరుస్తారని, ఇవన్నీ కోర్టులో విచారణలో ఉన్నాయని.. త్వరలో అన్నీ తేలతాయన్నారు.