నేడు కడప జిల్లాకు సీఎం జగన్‌

ABN , First Publish Date - 2020-09-01T09:24:21+05:30 IST

సీఎం జగన్‌ మంగళవారం కడప జిల్లాకు రానున్నారు. సెప్టెంబరు 2న తన తండ్రి, మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి

నేడు కడప జిల్లాకు సీఎం జగన్‌

కడప, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): సీఎం జగన్‌ మంగళవారం కడప జిల్లాకు రానున్నారు. సెప్టెంబరు 2న తన తండ్రి, మాజీ సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. మంగళవారం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి 4.45 గంటలకు కడపకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఎస్టేట్‌కు చేరుకుంటారు. రాత్రికి అక్కడే ఉండి బుధవారం ఉదయం వైఎస్సార్‌ ఘాట్‌కు చేరుకుని దివంగత వైఎ్‌సకు నివాళులర్పిస్తారు. అనంతరం తాడేపల్లికి బయలుదేరతారు.

Updated Date - 2020-09-01T09:24:21+05:30 IST