ఉత్తరాంధ్రపై జగన్‌ది కపట ప్రేమ: ఆనందబాబు

ABN , First Publish Date - 2020-02-08T22:43:37+05:30 IST

ఉత్తరాంధ్రపై సీఎం జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనందబాబు విమర్శించారు. తన తల్లి విజయలక్ష్మిని ఓడించారన్న పగతోనే విశాఖపట్నంపై జగన్ కక్ష కట్టారని వ్యాఖ్యానించారు. శనివారం ఇక్కడ మీడియాతో

ఉత్తరాంధ్రపై జగన్‌ది కపట ప్రేమ: ఆనందబాబు

విశాఖపట్నం: ఉత్తరాంధ్రపై సీఎం జగన్ కపట ప్రేమ చూపిస్తున్నారని మాజీ మంత్రి, టీడీపీ నేత నక్కా ఆనందబాబు విమర్శించారు. తన తల్లి విజయలక్ష్మిని ఓడించారన్న పగతోనే విశాఖపట్నంపై జగన్ కక్ష కట్టారని వ్యాఖ్యానించారు. శనివారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. అమరావతిలో క్విడ్ ప్రోకో జరిగిందన్న వైసీపీ నేతలు.. ఇంత వరకూ నిరూపించలేకపోయారని ఎద్దేవా చేశారు. కులాలు, మతాల వారీగా విడగొట్టి జగన్ పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉత్తరాంధ్ర గురించి మాట్లాడటానికి వైసీపీ నేతలు సిగ్గు పడాలని వ్యాఖ్యానించారు. విశాఖలో వైసీపీ నేతల భూ దందాలను బయటపెడతామని ఆనందబాబు చెప్పారు.

Updated Date - 2020-02-08T22:43:37+05:30 IST