సీఎం జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యే లేఖ
ABN , First Publish Date - 2020-03-25T00:19:46+05:30 IST
సీఎం జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యే లేఖ
అమరావతి: సీఎం జగన్‌కు టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి లేఖ రాశారు. కరోనా వైరస్‌పై ముందస్తు చర్యలు తీసుకోలేదని లేఖలో పేర్కొన్నారు. విదేశాల నుంచి వచ్చిన 15వేల మందికి ముందుగానే స్క్రీనింగ్ చేస్తే పరిస్థితి మరోలా ఉండేదన్నారు. ప్రస్తుత సమయంలో పేదలను అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా ఆదుకునేవని చెప్పారు. ఉపాధి కోల్పోయినవారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.