వర్షాలు, వరదలపై సీఎం జగన్‌ సమీక్ష

ABN , First Publish Date - 2020-08-17T01:44:56+05:30 IST

రాష్ట్రంలో వర్షాలు, వరదలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వరదల పట్ల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల

వర్షాలు, వరదలపై సీఎం జగన్‌ సమీక్ష

అమరావతి: రాష్ట్రంలో వర్షాలు, వరదలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. వరదల పట్ల కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ముంపు ప్రమాదం ఉన్న ప్రాంతాల నుంచి బాధితులను తరలించాలని సూచించారు. ప్రాణ నష్టం లేకుండా బాధితులను రక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ముంపు బాధితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. విపత్తు నిర్వహణ శాఖతో  అధికారులు సమన్వయం చేసుకోవాలని, గోదావరి వరద ఉద్ధృతి, ముంపు పరిస్థితులపై ఎప్పటికప్పుడు నివేదికలు ఇవ్వాలని జగన్‌ ఆదేశించారు.

Updated Date - 2020-08-17T01:44:56+05:30 IST