ఏపీలో కాలేజీల అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష
ABN , First Publish Date - 2020-09-01T21:20:28+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలేజీల అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాలేజీల అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీలు ఏర్పాటు, తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించారు. ఏపీలో 30 కాలేజీల నిర్మాణాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. కాలేజీల నిర్మాణం కోసం 20 చోట్ల స్థలాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వివిధ కోర్సులకు పాఠ్య ప్రణాళిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మొత్తం 162కి పైగా కాలేజీల్లో నైపుణ్యాభివృద్ధి పెంపొందించాలని, ప్రరిశ్రమల సర్వేల ఆధారంగా కోర్సుల రూపకల్పన చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షకు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్ చల్లా మధు సూదన్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.