హైదరాబాద్ చేరుకుని భారతి తండ్రిని పరామర్శించిన జగన్

ABN , First Publish Date - 2020-09-24T18:50:26+05:30 IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి నుంచి హైదరాబాద్‌‌కు వచ్చారు. తిరుమలలో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జగన్..

హైదరాబాద్ చేరుకుని భారతి తండ్రిని పరామర్శించిన జగన్

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి నుంచి హైదరాబాద్‌‌కు వచ్చారు. తిరుమలలో కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్పతో కలిసి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న జగన్.. ప్రత్యేక విమానంలో రేణిగుంట నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి వచ్చారు. తన మామ గంగిరెడ్డిని పరామర్శించేందుకు సీఎం జగన్ తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్‌కు విచ్చేశారు. జగన్ సతీమణి వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డి అనారోగ్యంతో కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఆసుపత్రికి వెళ్లి తన మామను పరామర్శించారు.

Updated Date - 2020-09-24T18:50:26+05:30 IST