మోదీ పిలుపునకు మద్దతివ్వండి: సీఎం జగన్

ABN , First Publish Date - 2020-04-05T23:33:55+05:30 IST

ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు మద్దతివ్వాలని ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను కోరారు.

మోదీ పిలుపునకు మద్దతివ్వండి: సీఎం జగన్

గుంటూరు: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపునకు మద్దతివ్వాలని ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలను కోరారు. రాత్రి 9 గంటలకు ఇళ్లలో లైట్లు ఆర్పి దీపాలు వెలిగించాలని సీఎం జగన్ సూచించారు. దీపాలు వెలిగించే ముందు ఆల్కాహాల్‌ ఆధారిత శానిటైజర్లు వాడొద్దని సీఎం జగన్ అన్నారు. శానిటైజర్లు చేతులకు రాసుకొని దీపాలు వెలిగించడం వల్ల మంటలంటుకునే ప్రమాదం ఉందని, తగిన జాగ్రత్తలు పాటించాలని సీఎం జగన్ ప్రజలకు సూచించారు.

Updated Date - 2020-04-05T23:33:55+05:30 IST