తీర్పుపై సీఎం జగన్‌ ఆరా!

ABN , First Publish Date - 2020-05-30T07:31:27+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై శుక్రవారం ..

తీర్పుపై సీఎం జగన్‌ ఆరా!

అమరావతి, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను తొలగిస్తూ ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌పై శుక్రవారం నాడు రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో సీఎంవోలోనూ, సచివాలయంలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ తీర్పు ఎలా ఉండబోతుందోనన్న ఆసక్తి ఉన్నతాధికారుల నుంచి ఉద్యోగుల వరకు కనిపించింది.


టీవీ చానళ్లలో వెలువడుతున్న అంశాలు, హైకోర్టు ప్రాంగణం నుంచి వస్తున్న సమాచారాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కూడా పరిశీలించారు. రాష్ట్ర ఎన్నికల కమినషనర్‌గా రమేశ్‌కుమార్‌ను తప్పించడాన్ని హైకోర్టు తప్పుపట్టడడంతో ఆయన కాస్త ఇబ్బందికి లోనైనట్లు తెలిసింది. వాస్తవానికి ఏడాది పాలనపై సమీక్షలో భాగంగా ‘మన పాలన-మీ సూచన’ కార్యక్రమం ఉదయం 11 గంటలకు మొదలు కావాల్సి ఉంది. కానీ కోర్టు తీర్పు వచ్చే సరికి మధ్యాహ్నం 12 గంటలయింది. ఆ తర్వాతే సీఎం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


Updated Date - 2020-05-30T07:31:27+05:30 IST