జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బ్రహ్మానందరెడ్డి, శిల్పా రవి

ABN , First Publish Date - 2020-08-02T03:17:53+05:30 IST

జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బ్రహ్మానందరెడ్డి, శిల్పా రవి

జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బ్రహ్మానందరెడ్డి, శిల్పా రవి

కర్నూలు: నంద్యాల శ్రీనివాసనగర్‌లో వైఎస్సార్ విగ్రహం వద్ద సీఎం జగన్ చిత్రపటానికి ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవి  పాలాభిషేకం చేశారు. కర్నూలుకు న్యాయ రాజధాని రావడం ఎంతో ఆనందంగా ఉందని బ్రహ్మానందరెడ్డి అన్నారు. న్యాయ రాజధానితో కర్నూలుతో పాటు రాయలసీమ అభివృద్ధి చెందుతుందని బ్రహ్మానందరెడ్డి చెప్పారు.


శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు శిల్పా రవి చెప్పారు. మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలిపినా ప్రతిపక్ష నాయకులు కోర్టుకు వెళ్తాం అనడం దారుణమని శిల్పా రవి విమర్శించారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల తర్వాత కర్నూలుకు న్యాయ రాజధాని ప్రకటిస్తే టీడీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే శిల్పా రవి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-08-02T03:17:53+05:30 IST