-
-
Home » Andhra Pradesh » CM Jagan letter to the Prime Minister
-
పోలవరంపై ప్రధానికి సీఎం జగన్ లేఖ
ABN , First Publish Date - 2020-10-31T22:04:16+05:30 IST
పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయానికి కేంద్రం భారీ కోత విధించడం... తాజాగా లెక్కలు చెబితేనే మిగతా రూ.9,288 కోట్లు చెల్లిస్తామని కేంద్రం తేల్చి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్రం షాక్‌ల మీద షాక్‌లు ఇవ్వడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి

అమరావతి: పోలవరం ప్రాజెక్ట్ అంచనా వ్యయానికి కేంద్రం భారీ కోత విధించడం... తాజాగా లెక్కలు చెబితేనే మిగతా రూ.9,288 కోట్లు చెల్లిస్తామని కేంద్రం తేల్చి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్రం షాక్‌ల మీద షాక్‌లు ఇవ్వడంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్.. ప్రధాని మోదీకి లేఖ రాశారు.
మోదీ, ఆర్థిక, జలశక్తి మంత్రులకు..
పోలవరంపై ప్రధాని మోదీకి సీఎం జగన్ లేఖ రాశారు. ప్రధానితో పాటు ఆర్థిక, జలశక్తి మంత్రులకు లేఖ రాశారు. జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని గుర్తుచేశారు. పోలవరం ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి లాంటిదని పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సమస్యలపై కూడా కేంద్రం దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. నిధుల విడుదల జాప్యం, పనులు ఆలస్యంతో అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉందని లేఖలో సీఎం జగన్ స్పష్టం చేశారు.






