కరోనాపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష

ABN , First Publish Date - 2020-04-15T18:57:00+05:30 IST

కరోనాపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష

కరోనాపై సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష

అమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తుండటంతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అప్రమత్తమయ్యారు. బుధవారం కరోనాపై సీఎం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు ఆళ్లనాని, బొత్స సత్యనారాయణ, మోపిదేవి, సీఎస్, డీజీపీ ఈ సమావేశానికి హాజరయ్యారు. కరోనా ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.


మరోవైపు రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 502కు చేరింది. కరోనా బారిన పడి 11 మంది మృతి చెందగా, 475 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా నుంచి కోలుకుని 16 మంది డిశ్చార్జ్ అయిన విషయం తెలిసిందే.

Updated Date - 2020-04-15T18:57:00+05:30 IST