సీఎం జగన్ భయపడుతున్నారు: అనిత

ABN , First Publish Date - 2020-02-12T20:50:37+05:30 IST

అమరావతి ఉద్యమం చూసి సీఎం జగన్‌ భయపడుతున్నారని టీడీపీ నాయకురాలు అనిత వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. తాడెపల్లిలో ఇల్లు కట్టుకుని

సీఎం జగన్ భయపడుతున్నారు: అనిత

విజయవాడ: అమరావతి ఉద్యమం చూసి సీఎం జగన్‌ భయపడుతున్నారని టీడీపీ నాయకురాలు అనిత వ్యాఖ్యానించారు. బుధవారం ఇక్కడి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. తాడెపల్లిలో ఇల్లు కట్టుకుని విశాఖను రాజధాని అనడానికి సిగ్గులేదా? అని ఘాటైన వ్యాఖ్యలతో సీఎం జగన్‌పై విరుచుకుపడ్డారు. పోలీసులను అడ్డుపెట్టుకుని సీఎం పర్యటనలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని విమర్శించారు. 151 మంది ఎమ్మెల్యేలు జగన్‌కు భజన బృందంగా మారారని ఎద్దేవా చేశారు. స్మశానం అంటున్న స్పీకర్‌ తమ్మినేని సీతారాం కు బుర్ర, బుద్ధి ఉన్నాయా? అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను విశాఖ వాసినే అని, తనను కూడా బెదిరించారని అనిత్ ఆరోపించారు.

Updated Date - 2020-02-12T20:50:37+05:30 IST