-
-
Home » Andhra Pradesh » CM jagan decision to run buses in AP
-
ఏపీలో బస్సులు నడపాలని సీఎం జగన్ నిర్ణయం
ABN , First Publish Date - 2020-05-18T22:13:33+05:30 IST
ఆంధ్రప్రదేశ్‌లో బస్సులు నడపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో బస్సులు నడపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. సోమవారం సీఎం జరిపిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కేంద్రం తాజాగా మార్గదర్శక సూత్రాల ప్రకారం అంతర్ రాష్ట్ర సర్వీసులు ఎలా నడపాలన్నదానిపై సమావేశంలో చర్చలు జరిపారు. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల నుంచి ఎవరైతే ఏపీకి రావాలనుకుంటున్నారో అందరినీ తీసుకు వచ్చేందుకు బస్సు సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. బస్సాండ్ నుంచి బస్సాండ్ వరకు సర్వీసులు నడపాలని మధ్యలో ఎవరినీ ఎక్కించుకోకూడదని కూడా నిర్ణయించారు. ఈ బస్సుల సంఖ్యను క్రమంగా పెంచుకుంటూ వెళ్లాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించారు.
బస్సులో ఎక్కిన వ్యక్తుల వివరాలు పూర్తి స్థాయిలో తీసుకోవాలని, అలాగే బస్సు దిగిన తర్వాత వారికి పరీక్షలు నిర్వహించాలని సీఎం జగన్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. బస్సుల్లో భౌతిక దూరం పాటించాల్సిందేనని ఇందులో ఎలాంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి విధివిధానాలు సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే ప్రైవేటు బస్సులను కూడా నడిపి తీరాల్సిందేనని, దీనికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.