సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ

ABN , First Publish Date - 2020-11-26T13:15:58+05:30 IST

సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ

సీఎం జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. విదేశాల్లో చదివే విద్యార్థుల స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. అల్పాదాయ వర్గాల విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు గత ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించిందని గుర్తుచేశారు. ఒక్కో విద్యార్థికి రు.10 లక్షల మేర గత ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇచ్చిందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విదేశీ విద్యార్థులకు ఇప్పటివరకు స్కాలర్షిప్లు మంజూరు చేయలేదని లేఖలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారి కారణంగా విదేశాల్లో చదివే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. 

Updated Date - 2020-11-26T13:15:58+05:30 IST