మొదటి నుంచి కరోనాపై జగన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు: అనురాధ

ABN , First Publish Date - 2020-04-05T22:44:02+05:30 IST

కరోనా వైరస్‌పై వైసీపీ ప్రభుత్వ లెక్కలు విచిత్రంగా ఉన్నాయని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మొదటి నుంచి కరోనాపై జగన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు: అనురాధ

గుంటూరు: కరోనా వైరస్‌పై వైసీపీ ప్రభుత్వ లెక్కలు విచిత్రంగా ఉన్నాయని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మొదటి నుంచి కరోనాపై జగన్‌ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న టెస్టులు తక్కువ అని పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. కృష్ణా జిల్లాలో 32 పాజిటివ్ కేసులు అని చెప్పారని, ఇవాళ మాత్రం 28 కేసులు అంటున్నారని పంచుమర్తి అనురాధ ఆగ్రహం వ్యక్తం చేశారు. 29 వేల మంది విదేశాల నుండి వచ్చారని చెప్పారని, చేసిన టెస్టులు మాత్రం 3 వేలు కూడా దాటలేదని అనురాధ అన్నారు.

Updated Date - 2020-04-05T22:44:02+05:30 IST