కేంద్రానికి సీఎం జగన్ లేఖ

ABN , First Publish Date - 2020-05-13T23:04:19+05:30 IST

కేంద్రానికి సీఎం జగన్ లేఖ

కేంద్రానికి సీఎం జగన్ లేఖ

అమరావతి: కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహాని పదవీ కాలాన్ని పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. ఈ ఏడాది జూన్ 30వ తేదీన ప్రధాన కార్యదర్శి నీలం సహాని రిటైర్ కానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన కార్యదర్శి పదవీకాలాన్ని మరో 6 నెలలు పొడిగించాలని సీఎం జగన్ కేంద్రాన్ని కోరారు. నీలం సహాని ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు స్వీకరించి 6 నెలలే కావడంతో పదవీకాలాన్ని పొడిగించాలని ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కరోనా విపత్తు సమయంలో పదవి విరమణ చేసే అధికారులకు మూడు నెలల వరకు పలువురికి పదవీ కాలాన్ని  కేంద్రం పొడిగించింది. ఈ అంశంపై కేంద్రం నిర్ణయం కోసం వేచి చూడాల్సి ఉంది.

Read more