-
-
Home » Andhra Pradesh » cm jagan aerial survey
-
రేపు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
ABN , First Publish Date - 2020-11-28T01:32:37+05:30 IST
రేపు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేయనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో

తిరుపతి: రేపు తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే చేయనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో తుఫాను తీవ్రతకు గురైన ప్రాంతాల్లో ఏరియల్ సర్వే ద్వారా ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. సీఎం జగన్.. విజయవాడ నుంచి తిరుపతికి ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారు. అక్కడ నుంచి హెలికాప్టర్‌లో ఏరియల్ సర్వేకు వెళ్లనున్నారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో వరదపై అధికార యంత్రాంగంతో రివ్యూ మీటింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
నివర్ తుఫాన్‌తో పంట పొలాలు, ఇళ్లు ధ్వంసం అయ్యాయి. మూగ జీవాలు చనిపోయాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ బాధిత కుటుంబాలు వేడుకుంటున్నాయి.