పంపుసెట్లకు మీటర్లతో నష్టం లేదు

ABN , First Publish Date - 2020-10-13T08:53:06+05:30 IST

వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ను పెట్టడం వల్ల రైతులపై అదనంగా రూపాయి కూడా భారం పడబోదని, ..

పంపుసెట్లకు మీటర్లతో నష్టం లేదు

రైతుల్లో ప్రచారం చేయండి

జాప్యమొద్దు.. 

అపోహలకు తావివ్వొద్దు

అధికారులకు సీఎం ఆదేశం


అమరావతి, అక్టోబరు12(ఆంధ్రజ్యోతి): వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల ను పెట్టడం వల్ల రైతులపై అదనంగా రూపాయి కూడా భారం పడబోదని, వారికి నష్టం లేదని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ఈ అంశాన్ని రైతుల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని అధికారులను ఆదే శించారు. సోమవారం ఆయన విద్యుత్‌ శాఖపై సమీక్ష నిర్వహించారు. పంపుసెట్లకు మీటర్ల ఏర్పాటు కార్యక్రమంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది.


‘‘మీటర్ల ఏర్పాటు సకాలంలో పూర్తి కావాలంటే అధికారులు ప్రణాళిక రూపొందించుకొని పనిచేయాలి. మీటర్ల ఏర్పాటు వల్ల ప్రతి 15 నిమిషాలకు ఒకసారి అవి తిరుగుతున్న స మాచారం కేంద్ర కార్యాలయానికి వస్తుంది. విద్యుత్‌ సరఫరాను తెలుసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల అంతరాయాలు లేకుండా 9 గంటలపాటు విద్యుత్‌ సరఫరా చేయడానికి వీలు పడుతుంది’’ అన్నారు.

Updated Date - 2020-10-13T08:53:06+05:30 IST