ఏడాదికి అందిన వరద సాయం

ABN , First Publish Date - 2020-08-20T08:43:14+05:30 IST

గతేడాది గోదావరి వరద దుస్థితికి చలించిన సీఎం జగన్‌ ఏరి యల్‌ సర్వే తర్వా త వరద బాధితులకు రూ.5 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. కట్టబట్టలతో కొండల మీద, ఇళ్ల మీద ఉన్నవారికి ఈ సొమ్ముతో ఆసరా దొరుకుతుందని సీఎం అప్పట్లో ప్రకటించారు...

ఏడాదికి అందిన వరద సాయం

  • అప్పట్లో సీఎం ప్రకటించిన 5 వేలు మంగళవారం 
  • సీఎం పర్యటన సాగుతుండగా జమ

(రంపచోడవరం/దేవీపట్నం - ఆంధ్రజ్యోతి)

గతేడాది గోదావరి వరద దుస్థితికి చలించిన సీఎం జగన్‌ ఏరి యల్‌ సర్వే తర్వా త వరద బాధితులకు రూ.5 వేల ఆర్థిక సాయం ప్రకటించారు. కట్టబట్టలతో కొండల మీద, ఇళ్ల మీద ఉన్నవారికి ఈ సొమ్ముతో ఆసరా దొరుకుతుందని సీఎం అప్పట్లో ప్రకటించారు. కానీ ఇప్పటివరకు దాని జాడలేదు. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ పలుమార్లు కథనాలు ఇచ్చింది. అయినా అధికారుల స్పందన లేదు. మళ్లీ ఇప్పుడు వరదలు ముంచెత్తడంతో సీఎం జగన్‌ మంగళవారం ఏరియల్‌ సర్వే నిర్వహించారు.


సీఎం పర్యటనకు వస్తున్నారని తెలియగానే ఉదయంపూట అప్పటికప్పుడు గత ఏడాది ప్రకటించిన రూ.5 వేల వరద సాయాన్ని అధికారులు బ్యాంకుల్లో జమ చేయడం ప్రారంభించారు. బుధవారం కూడా ఇది కొనసాగింది. తూర్పుగోదావరి జిల్లా మన్యం వరద బాధితులకు... ముఖ్యంగా దేవీపట్నం మండలంలోని బాధితులకు ఈ సాయం వేస్తున్నారు. కాగా, నేటి వరకూ అందకపోయినా... గతఏడాది రూ.5 వేల సాయాన్ని సీఎం మంజూరు చేయడంతో బాధితులు సంతోషించారు. మళ్లీ ఇప్పుడు వరదల్లో అదే కష్టాలను పడుతుండగా... కేవలం రూ.2 వేల సాయం ప్రకటించడంపై బాధితులు పెదవి విరుస్తున్నారు. గత ఏడు మాదిరిగానైనా సాయం అందించాలని వారు కోరుతున్నారు.

Read more